అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా..ముగ్గురు మృతి

-

రోజు రోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. అతివేగం, తదితర కారణాల వల్ల జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడి ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. 40మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.

మృతి చెందిన వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. చింతూరు మండలం పిడుగురాళ్లపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఒడిషా భవానిపట్నం నుంచి విజయవాడకు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version