2 కోట్లు.. అంద‌మైన అమ్మాయిలు.. ఏది కావాలి..?

-

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా వివాహం జరిగి మూడేళ్ల తర్వాత తొలిసారిగా ఓ సినిమా చేస్తోంది. అదే ‘ది స్కై ఈ పింక్‌’. ఈ సినిమాలో ఫర్హాన్ అక్తర్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక 21 ఏళ్ల కూతురు ఉన్న తల్లి పాత్రలో నటిస్తున్నారు. సోనాలి బోస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో జైరా వసీమ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అక్టోబర్‌ 11వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఆదివారం ప్రియాంక ‘ది కపిల్ శర్మ షో’లో పాల్గోన్నారు.

తాను కథానాయికగా నటించన ‘ది స్కై ఈజ్ పింక్’ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ షోకు హాజరై కపిల్‌తో కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా ప్రియాంక కపిల్‌ను ఓ ప్రశ్న అడిగారు. ‘నీకు రూ.2 కోట్లు కావాల? లేక అమ్మాయిలతో కలిసి మాల్దీవ్స్‌కి ఫ్రీ ట్రిప్ కావాల? రెండింట్లో దేనిని ఎంచుకుంటావ్?’ అని ప్రశ్నించారు. ఇందుకు కపిల్ స్పందిస్తూ.. ‘నాకు రూ.2 కోట్లు కావాలి. ఎందుకంటే 60 వేలు పెడితే టూర్‌కు వెళ్ల‌వ‌చ్చు అని సమాధానమిచ్చారు. దాంతో ప్రియాంక చోప్రాతో పాటు అక్కడున్నవారంతా షాకై పగలబడి నవ్వుకున్నారు. దీన్ని క‌పిల్ త‌న ఇన్‌స్టాలో పంచుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version