శరన్నవరాత్రులు దేశమంతా ఘనంగా ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 1 మంగళవారం మూడోరోజు. ఈ రోజు అమ్మవారిని చంద్రఘంటగా అరాధిస్తారు. అలంకార విషయానికి వస్తే విజయవాడ కనకదుర్గ దేవాలయంలో అమ్మవారు మూడోరోజు గాయత్రిదేవిగా దర్శనమివ్వనున్నారు. మిగిలిన ప్రాంతాల్లో చంద్రఘంట రూపంలో దర్శనమిస్తారు. ఈ రూపంలో అమ్మవారు స్వరూపం చంద్రబింబం వలె ఉంటుంది. అమ్మవారిని తెల్లటి పూలతో పూజిస్తారు. “గాయత్రి వ్యాహృతి సంధ్యా నిజబృంద నిషేవితా“ అనే మంత్రాన్ని జపిస్తారు. గాయత్రి దేవి అనుగ్రహంతో జీవితంలో అన్నపానాలను ఎటువంటి ఢోకా ఉండదని భక్తుల నమ్మకం.
అమ్మవారిని కింది ధ్యానశ్లోకంతో ఆరాధించాలి
“ముక్తావిద్రుమ హేమనీల ధవళశ్ఛాయే ముఖైః త్రియక్షణైః
యుక్తాబిందుం నిబద్ధరత్నాం తత్వార్ధవర్ణాత్మికాం” అనే శ్లోకంతో ఆరాధిస్తే అమ్మ శ్రీఘంగా అనుగ్రహిస్తుంది. ఈ శ్లోకం రానివారు గాయత్రీ మంత్రాన్ని కనీసం 11సార్లు జపిస్తే మంచి ఫలితం లభిస్తుంది. ఏ మంత్రానైనా శుచితో ఏకాగ్రతతో పఠిస్తే ఫలితం వస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
– కేశవ