ప్రియాంక చోప్రా గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె ఇప్పుడు గ్లోబల్ ముద్దు గుమ్మ. ఒకప్పుడు బాలీవుడ్ లో హీరోయిన్ గా నటించిన ప్రియాంక చోప్రా తన అందచందాలు తో మెప్పించింది. బాలీవుడ్ లో గుర్తింపు పొందిన తర్వాత అమ్మడు మకాం హాలీవుడ్ కు మార్చింది. అక్కడ వెబ్ సీరీస్ లు , సినిమాలు చేస్తూ హాలీవుడ్ లో పాపులర్ అయింది.
ఇక తనకంటే పదేళ్ల చిన్నవాడైన హాలీవుడ్ సింగర్ అండ్ యాక్టర్ నిక్ జోనాస్ ప్రేమలో పడిన ప్రియాంక అతనితో డేటింగ్ లో మునిగి పోయింది. మీడియా లో ప్రతి రోజు ఇదే టాపిక్ మీద వార్తలు వస్త్తూ ఉండేవి. ఇక లాభం లేదనుకుని అతన్ని ఎలాగోలా కన్విన్స్ చేసి పెళ్లి చేసుకుని న్యూయార్క్ లో సెటిల్ అయ్యింది.
ఈమె హాలీవుడ్ నటి కాబట్టి ఆమె డ్రెస్సింగ్ స్టైల్ మొత్తం మనోళ్లు గ్లామర్ బోజనంగా వుంటుంది.ఇక ఆమె ఏ మాత్రం గ్యాప్ దొరికినా హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూనే ఉంటుంది.ఎప్పటి కప్పుడు తన అందాలు చూపిస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది.ఈ బ్యూటీ ఫొటోలు ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంటాయి. ఇక రాజమౌళి కూడా మహేష్ బాబు తో చేసే గ్లోబల్ సినిమా లో ప్రియాంక చోప్రా ఐతే పాన్ ఇండియా అలాగే పాన్ వరల్డ్ మూవీ అవుతుందని ఆ దిశగా అడుగులు వేస్తున్నారట.