యువత అర్ధం చేసుకుంది: ప్రియాంక గాంధీ

-

కేంద్రం మీద కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ దేశం లో యువతకి ఉపాధి కల్పించదని ఈ విషయాన్ని యువత అర్థం చేసుకుందని అన్నారు వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడం లో కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళికను కలిగి ఉందని అన్నారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ విడుదల చేస్తున్న ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024 ని ఉటంకిస్తూ ఇండియా లో మొత్తం నిరుద్యోగుల్లో 83% యువత లేని ప్రియాంక గాంధీ అన్నారు.

పేపర్ లీకేజీ లని అరికట్టడానికి కాంగ్రెస్ కఠిన చర్యలు తీసుకుంటుందని కఠిన చట్టాలను తీసుకొస్తుందని ప్రియాంక గాంధీ అన్నారు. స్టార్ట్ అప్ ల కోసం ఐదు వేల కోట్ల రూపాయలు జాతీయ నిధిని ఏర్పాటు చేయడం వంటి హామీలను అమలు చేస్తామని కూడా ప్రియాంక గాంధీ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version