మా మీద విష ప్రచారాలు చేస్తే నాశనం అయిపోతారని మంత్రి సీతక్క అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందులో ఆమె మాట్లాడారు సొంత యూట్యూబ్ ఛానల్స్ ని పెట్టుకుని ప్రజల్లో ఉండే నాయకులు మీద ఇష్టానుసారంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు సీతక్క.
మహబూబ్నగర్ జిల్లాలో ఏసీబీకి చిక్కిన మహిళా సబ్ రిజిస్టర్ తో సంబంధం అంటకట్టి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని గతంలో తన ప్రైవేటు పీఏ తనిఖీ తెలియకుండా చేసిన తప్పుకి అతన్ని తొలగించి నిజాయితీని నిరూపించుకుంటే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మా మీద దుష్ప్రచారం చేసినవాడు ఎప్పుడూ కూడా బాగుపడి బట్ట కట్టలేదు ఇటువంటి దుర్మార్గపు దుష్ప్రచారాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారని కచ్చితంగా నాశనం అయిపోతారని అన్నారు.