కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2022లో ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 40 శాతం అసెంబ్లీ సీట్లను మహిళలకు కేటాయించనున్నట్లు వెల్లడించింది. మహిళల సాధికారతకే కాంగ్రెస్ పెద్ద పీట వేస్తుందని, దీనిలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం, ఎజెండా లేదని ఆమె అన్నారు. కులం, మతం ఆధారంగా కాకుండా కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే సీట్లు కేటాయిస్తామని ప్రియాంక గాంధీ వెల్లడించారు. ఇదే కాకుండా ఇటీవల జరిగిన లఖీంపూర్ ఖేరీ రైతు హత్యల గురించి ఆమె ప్రస్తావించారు.
ప్రియాంక గాంధీ సంచలన నిర్ణయం.. 40 శాతం అసెంబ్లీ టికెట్లు వాళ్లకే..
-