ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన ఫిక్స్

-

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇప్పటికే ఆయా పార్టీల నేతలు ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో విజయం సాధించాలని చూస్తుంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్ని అనుసరిస్తూ..కాంగ్రెస్ కీలక నేతలతో రాష్ట్రంలో ప్రచారాన్ని నిర్వహిస్తుంది.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ కీలక నాయకురాలు ప్రియాంక గాంధీ.. తెలంగాణలో ప్రచారం చేయనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా మే 6న తాండూరు పట్టణంలో భారీ సభను నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే బహిరంగ సమావేశం నిర్వహించే ప్రదేశాన్ని కాంగ్రెస్ నేతలు ఇప్పటికే సందర్శించారు. కాగా ప్రియాంక గాంధీ వరుసుగా 6, 7, 8 తేదీల్లో తెలంగాణలో పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version