మోదీ, కేడీ కలిసి సిలిండర్ రూ.12 వందలు చేశారని రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.కూకట్ పల్లిలో రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…కేసీఆర్ చేసిన దోపిడిని చూసి తెలంగాణ ప్రజలు బీఆర్ఎను బంగాళాఖాతంలో కలిపి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
తన ఇంటి తలుపులు పగలొగట్టి అర్థరాత్రి పూట అరెస్టు చేశారని, ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు రేవంత్ రెడ్డి. ఎవ్వరూ ఎవ్వరికి బయపడాల్సిన అవసరం లేదన్నారు. బస్తీలలో ఉండే 26 కులాల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మహిళలకు ఫ్రీ బస్సు ఏర్పాటు చేశామని ,ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షలు ఇస్తున్నామని అన్నారు. ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని ,అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే వేల ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ రెడ్డి తెలిపారు. పట్నం సునితను ఎంపీగా గెలిపిస్తే మల్కాజ్ గిరి మరింత అభివృద్ధి చెందుతుందని సీఎం రేవంత్ అన్నారు.