కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేశారు. ఆగస్టు 1 లోగా లోధి ఎస్టేట్ నివాసాన్ని ఖాళీ చేయాలని ప్రియాంకకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో గురుగ్రామ్‌లోని ఓ ఇంట్లో కొద్దిరోజుల పాటు ఉండనున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను గురువారం ఖాళీ చేశారు. ఢిల్లీలో ఆమె అద్దెకు తీసుకున్న నివాసంలో నవీకరణ పనులు జరుగుతున్నందున కొద్ది రోజుల పాటు గురుగ్రామ్‌లోని ఓ ఇంట్లో ఉండనున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.
ఆగస్టు 1 లోపు లోధి ఎస్టేట్‌లోని అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సిందిగా ప్రియాంక గాంధీకి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నోటీసులు జారీ చేసింది. ఎస్పీజీ భద్రత లేని వారికి ప్రభుత్వ బంగ్లాల్లో ఉండరాదన్న నిబంధనలను గుర్తుచేసింది.
ఈ బంగ్లా ఖాళీ చేసే నేపథ్యంలో అనేక రాజకీయ విమర్శలు నెలకొన్నాయి. ఎందుకంటే ఈ బంగ్లాను బీజేపీ నేత కేటాయించారు.