ఉదయం ఈ ఆహార పదార్ధాలని తీసుకుంటే సమస్యలే..!

-

మనం తినే దానిలో అల్పాహారం చాలా ముఖ్యమైనది. అల్పాహారం తీసుకోకుండా రోజు మొదలు పెడితే ఇబ్బంది పడాల్సి వస్తుంది. సరైన పోషక పదార్థాలతో అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం లేదు అంటే చాలా ఇబ్బందులు వస్తాయి.

 

ప్రతి రోజూ తీసుకునే అల్పాహారంలో ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు తప్పక ఉండాలి. అయితే చాలా మంది ఈ ఆహార పదార్థాలను తీసుకుంటారు. వీటి వల్ల చాలా సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. మరి వాటి కోసం మనం ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రెడ్:

హడావిడిగా పనిలో పడి పోయి వేగంగా అయిపోతుందని ఒక వైట్ బ్రెడ్ తీసుకుని దాని మీద జామ్ లేదా సాస్ ని రాసుకుని తినేసి వెళ్లిపోతుంటారు. అయితే బ్రెడ్ తినడం వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే వైట్ బ్రెడ్ లో ఎలాంటి పోషక పదార్థాలు ఉండవు. అందుకని మీరు వైట్ బ్రెడ్ ని అస్సలు తినొద్దు. దీనికి బదులుగా మీరు మల్టీ గ్రైన్ బ్రెడ్ తినచ్చు. దానిమీద తక్కువ కొవ్వు ఉండే బట్టర్ లేదా చీజ్ ని రాసుకొని తింటే ఫలితం ఉంటుంది.

పాన్ కేక్స్:

చాలా మందికి ఇవి ఫేవరెట్. అయితే ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. వీటిలో రిఫైన్డ్ ఫ్లోర్ ఎక్కువగా ఉంటుంది. ఒబిసిటీకి ఇది దారితీస్తుంది.

మఫిన్స్:

చాలా మంది మఫిన్స్ ని బ్రేక్ఫాస్ట్ లో తీసుకుంటారు. ఇందులో రిఫైన్డ్ చేసిన పిండి, వెజిటేబుల్ ఆయిల్ తో పాటు ఎక్కువ పంచదార కూడా ఉంటుంది. అయితే దీని వల్ల కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

కాఫీ:

ఖాళీ కడుపున కాఫీ తీసుకోవడం వల్ల ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని వీలైతే ఉదయాన్నే కాఫీ కి దూరంగా ఉండండి. ఒకవేళ కనుక మీరు కాఫీని విడిచిపెట్టి ఉండలేకపోతే అప్పుడు ఏదైనా తిన్న తర్వాత కాఫీ తాగండి లేదు అంటే సమస్యలు తప్పవు.

Read more RELATED
Recommended to you

Exit mobile version