నిర్మాత అల్లు అరవింద్ భయపడ్డ వేళ..!!

-

అల్లు శిరీష్ హీరో గా నటించిన ఊర్వశివో రాక్షసివో అనే సినిమా నవంబర్ 4వ తేదీ విడుదల కానుండడంతో సినిమా యూనిట్ పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వంలో GA2 పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ మూవీలో అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే శిరీష్,అనుల మధ్య హాట్ హాట్ సన్నివేశాలు ఇంటెర్నెట్ ను ఊపేస్తున్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో విడుదల చేయనున్నారు.

ఈ సినిమా  ప్రమోషన్లో భాగంగా చిత్ర యూనిట్  ప్రముఖ హోటల్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది.ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ఈ సినిమా ఎప్పుడో రెడీ అయ్యింది.కాని కోవిడ్ వల్ల బాగా ఆలస్యం అయ్యింది. వాస్తవానికి ఈ సినిమా కథ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అందించారు. ఈ మధ్య కాలంలో ఎవరికి ఆయన గారు కథ అందించలేదు, వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నారు.

అలాగే ఈ సినిమా ప్రీమియర్ షో కి అధ్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. అందరూ సినిమా బాగుంది అని ముందుగానే అభినందనలు తెలిపారు. అదే సమయంలో తమ్మారెడ్డి భరద్వాజ్ నుండి ఫోన్ కాల్ వచ్చింది.నేను సినిమా బాగాలేదని అంటారని, తన కథను చెడ కొట్టారని కొప్పడతారని భయం తో ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత ఆయన చాలా సార్లు చేసే సరికి, చివరికి కాల్ ఎత్తాల్సి వచ్చింది. ఆశ్చర్యకరంగా ఆయన తిట్టకుండా మన సినిమా సూపర్ గా వచ్చింది అంటూ ప్రశంశలు కురిపించారు. దానితో సినిమా పై నాకు బాగా నమ్మకం పెరిగింది అని చెప్పుకొచ్చారు అల్లు అరవింద్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version