బిగ్ బాస్: రేవంత్ ను అంత మాట అనేసిన నాగార్జున.. ఏమైందంటే..?

-

ప్రస్తుతం ఇండియాలో ఎన్నో భాషలలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ తెలుగులో మాత్రమే భారీ స్థాయిలో రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటూ నెంబర్ వన్ రియాల్టీ షో గా గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఇప్పుడు ఆరవ సీజన్ సరికొత్త హంగులతో ప్రసారం చేస్తున్నారు. గత వారంలో కంటెస్టెంట్ లు నిరాశ పరచడంతో బిగ్ బాస్ సీరియస్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే అక్కినేని నాగార్జున కూడా కొందరు కంటెస్టెంట్లపై ఫైర్ అవడం జరిగింది. అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం.

ప్రస్తుతం బిగ్ బాస్ షో కి తెలుగులో భారీ స్పందన లభిస్తున్న నేపథ్యంలో వినూత్నమైన ప్లాన్లతో ముందుకు వస్తున్నారు. అయినప్పటికీ రేటింగ్ ను మాత్రం అందించడం లేదు ఏడో వారం కెప్టెన్సీ పోటీ దారులను ఎంపిక చేసేందుకు నిర్వాహకులు సెలబ్రిటీ గేమింగ్ లీగ్ ఫెయిల్ అవ్వడంతో కంటెస్టెంట్ లందరికీ బిగ్ షాక్ తగిలింది . దీంతో అన్ని సదుపాయాలు బంద్ చేసిన బిగ్బాస్ ఆ తర్వాత కంటెస్టెంట్లకు “బ్యాటిల్ ఫర్ సర్వైవర్” అనే టాస్క్ ఇచ్చారు. మొత్తంగా ఏడో వారం ఇంటికి కొత్త కెప్టెన్ ను ఎంపిక చేయకుండానే ముగించేశారు.


నాగార్జున కంటెస్టెంట్లపై విరుచుకుపడుతూ తనదైన రీతిలో వారిపై నిప్పులు చెరుగుతున్నాడు. ఇకపోతే శనివారం ఎపిసోడ్ పై ఆసక్తి నెలకొనే విధంగా తాజా ప్రోమోను వదిలారు. ఈవారం జరిగిన టాస్క్ లో ఓడిపోయిన బ్లూ టీం లోని ఒక కంటెస్టెంట్ నేరుగా వచ్చే వారానికి నామినేట్ కావాలని బిగ్ బాస్ చెప్పాడు. దాంతో ఆ టీం కెప్టెన్ శ్రీ సత్య ముందుకు వచ్చింది. ఆ తర్వాత మనసు మార్చుకుని చీటీలు తీద్దామని చెప్పింది. అందులోను ఆమె పేరు వస్తే ఓటింగ్ పెడదామని చెప్పింది.దీంతో సత్యా పై ఫైర్ అయ్యాడు నాగార్జున. అంతేకాదు ఆరో సీజన్లోకి ఎంతోమంది కంటెస్టెంట్లు వచ్చారు కానీ అందులో మాత్రం టైటిల్ ఫేవరెట్ గా బరిలో దిగాడు రేవంత్. అందుకు అనుగుణంగానే అతడు తనదైన శైలిలో ఆడుతూ ఓటింగ్లో దూసుకుపోతూ సేఫ్ అవుతూ వస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నాగార్జున మొదటిసారి రేవంత్ పై ఫైర్ అవుతూ పప్పు అని పిలుస్తూ అందరి ముందే పరువు తీశాడు .ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version