జనసేనలోకి ప్రముఖ నిర్మాత..!

-

కేఎల్పి మూవీస్ సంస్థ అధినేత నిర్మాత కాయగూరల లక్ష్మీపతి నేడు జనసేన పార్టీలో చేరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా జనసేన పార్టీ నేతలు కాయగూరల లక్ష్మీపతికి శుభాకాంక్షలు చెప్పారు. లక్ష్మీపతి తండ్రి గారు క్రీ. శే శ్రీ కే నారాయణస్వామి గారు టిడిపి ఆవిర్భావం నుండి పార్టీ మణికొండ కోసం ప్రజాసేవ కోసం కృషి చేసిన ఆయన తన తండ్రి గారి స్ఫూర్తితో నిర్మాత లక్ష్మీపతి కూడా ప్రజలకి సేవ చేయాలని అనుకున్నారు.

అందుకని జనసేన పార్టీలో చేరారు ఆయన. ఈ సందర్భంగా కాయగూరల లక్ష్మీపతి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంతో ఇష్టమని చెప్పారు గతంలో పలు సేవా కార్యక్రమాల్లో ఆయనతో కలిసి పాల్గొన్నట్లు కూడా చెప్పారు. సినిమా అంటే ఇష్టంతో ఐక్యూ సినిమాని నిర్మించాలని ఇంకా రెండు సినిమాలు నిర్మాణ దశ లో ఉన్నాయని అన్నారు అలానే ఆయన మాట్లాడుతూ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అని చెప్పారు

Read more RELATED
Recommended to you

Exit mobile version