బిజినెస్ ఐడియా: ఈ బిజినెస్ చేస్తే లాభాలు లక్షల్లో….!

-

మీరు ఏదైనా బిజినెస్ చెయ్యాలని అనుకుంటున్నారా…? అయితే మీకోసం ఈ బెస్ట్ ఐడియా. దీనితో మీరు మంచిగా సంపాదించచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తిగా చూస్తే… పాలు, పాల ఉత్పత్తులకు ఇండియాలో ఎంతో డిమాండ్ ఉంది. కనుక మీరు డైరీ ఫామ్ ని స్టార్ట్ చెయ్యచ్చు.

దీనిలో మీరు రూ.5 లక్షల పెట్టుబడి పెడితే… నెలకు రూ.70,000 సంపాదించగలరు. భారీ లాభాలు పొందాలి అనుకునే వారికి ఇదో సరైన ఆప్షన్ అవుతుంది. ప్రధానమంత్రి ముద్ర యోజన (PMMY) అనే కేంద్ర పథకం కూడా వస్తుంది.

ఇక పెట్టుబడి విషయానికి వస్తే… ఇందుకు మొత్తం రూ.16.5 లక్షలు పెట్టుబడి అవసరం అవుతుంది. సొంతంగా రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే… మిగతా డబ్బును కేంద్రం ముద్ర రుణం కింద ఇస్తుంది. దీనితో మీరు ఈజీగా స్టార్ట్ చెయ్యచ్చు. ప్రాసెసింగ్ ఏరియా, రిఫ్రిజిరేషన్ రూంగా, వాషింగ్ ఏరియాగా కోసం కొద్దిగా స్థలం కావాలి. ఇవి కూడా ఏర్పాటుచేసుకోవాలి.

అదే విధంగా కొన్ని మిషన్లు కూడా కావాలి. ప్యాకింగ్ యంత్రం, క్రీమ్ సెపరేటర్, ఆటోక్లేవ్, బాటిల్స్, రిఫ్రిజిరేటర్, డీప్ ఫ్రీజర్, కాన్ కూలర్, కాపర్ బాటమ్ హీటింగ్ పాత్రలు, స్టెయిన్ లెస్ స్టీల్ స్టోరింగ్ పాత్రలు, ప్లాస్టిక్ ట్రే, డిస్పెన్సర్, స్లాట్ కన్వేయర్స్ కొనుగోలు చెయ్యాలి. ఇది ఇలా ఉండాగా కొన్ని సమన్లు కూడా కావాలి.

ప్రతి నెలా మీరు 12,500 లీటర్ల పాలు, 1000 కేజీల పంచదార, 200 కేజీల ఫ్లేవర్లు, 625 కేజీల మసాలాలు అంటే ఉప్పు లాంటివి కొనుగోలు చెయ్యాల్సి ఉంటుంది. ఇక ఎంత డబ్బులు వస్తాయి అనేది చూస్తే… మీరు 75 లీటర్ల ఫ్లేవర్డ్ మిల్క్, 36,000 లీటర్ల పెరుగు, 90,000 లీటర్ల వెన్న, 4,500 కేజీల నెయ్యిని అమ్మితే కనుక సంవత్సరానికి రూ.82.5 లక్షలు వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news