“ప్రాజెక్ట్ K” విజువల్ ఎఫెక్ట్స్ పై డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

-

ఇండియన్ సినిమాలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ అండ్ కాస్ట్లీ చిత్రం ఏదైనా ఉంది అంటే అది పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యంగ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మాసివ్ పాన్ వరల్డ్ చిత్రం “కల్కి 2898ఎడి” ఒకటే అని చెప్పాలి. వరల్డ్ క్లాస్ లెవెల్లో ప్లాన్ చేస్తున్న ఈ చిత్రం మొదట ప్రాజెక్ట్ కే గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు అంతకు మించి గ్రాండ్ గా వెళ్తుంది.

ఇక ఈ చిత్రం విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో అయితే దర్శకుడు లేటెస్ట్ గా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది. తాను మొదట ఈ చిత్రానికి మొత్తం వి ఎఫ్ ఎక్స్ అన్నీ ఇండియా లోనే చేయిద్దాం అనుకున్నాను అని కానీ కొన్ని కారణాలు చేత సాధ్యపడలేదు బట్ దాదాపు వి ఎఫ్ ఎక్స్ వర్క్ మాత్రం లోకల్ గానే ఈ సినిమాకి చేశామని తెలిపాడు. అలాగే ఇక నెక్స్ట్ తన సినిమాకి మాత్రం పూర్తిగా ఇండియా టాలెంట్ తోనే బెటర్ వి ఎఫ్ ఎక్స్ డిజైన్ చేసిన కంప్లీట్ ఇండియన్ ప్రాజెక్ట్ గా చేస్తానని తెలిపాడు. అయితే ప్రాజెక్ట్ కే విషయంలో నాగ్ అండ్ టీం స్టార్టింగ్ నుంచే ఎన్నో విభాగాల్లో ఇండియా వైడ్ గా ఎంతో మంది టాలెంట్ ని ఆడిషన్ చేసిన సంగతి తెలిసిందే. అలా ప్రాజెక్ట్ కే అయితే తెరకెక్కుతూ వచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version