GHMC డంప్ యార్డు ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తూ గుమ్మడిదలలో వినూత్న తరహాలో నిరసన తెలిపారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లపల్లి, ప్యారా నగర్ గ్రామాల శివారులో డంప్ యార్డు ఏర్పాటు నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ గేదెలతో, ఎడ్ల బండ్లతో నిరసన తెలిపారు రైతులు. డంప్ యార్డుకు వ్యతిరేకంగా మోకాళ్లపై నిలబడి, గేదెలపై డంపింగ్ యార్డ్ వద్దు మా కడుపు కొట్టొద్దు అని రాసి రోడ్ల వెంట ర్యాలీ తీశారు రైతులు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి.
అయితే ప్యారానగర్‌లో డంప్ యార్డు ఏర్పాటు చేయడం పట్ల స్థానికుల నుంచి ఆందోళనలు వస్తున్నాయి. అలాగే స్థానిక ప్రజలంతా డంప్ యార్డు ఏర్పాటు వల్ల వచ్చే సంబంధించిన సమస్యలను పరిగణనలోకి తీసుకుని ఆందోళన పడుతున్నారు. ఈ డంప్ యార్డుతో రాయరావు చెరువులో వ్యర్థజలాలు చేరి.. నీళ్లు కలుషితమవుతాయని తెలుపుతున్నారు. ఈ కారణంగా పంట పొలాలు, నీటి వనరులు తీవ్రంగా ప్రభావితమవుతాయని.. పశువులకు ఇబ్బందులు కలుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.