తన నాలుగో పెళ్లాం జగనేమో అన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైసీపీ ధ్వజమెత్తింది. ‘సిగ్గు, లజ్జ వదిలేసి ముఖ్యమంత్రి ని పట్టుకుని నీ పెళ్లాం అని అంటున్నావంటే నీ స్థాయి ఏమిటో అర్థమవుతోంది అని మండిపడింది. నీలాంటి ఉన్మాదులు చట్టసభలకు ఎన్నిక కావొద్దనే గతంలో ప్రజలు ఓడించారు.. రేపూ ఓడిస్తారు అని దుయ్యబట్టింది. ఒంటిమీద సోయి, మాట మీద అదుపు, చేతల్లో స్పష్టత ఉంటే రాజకీయాలు ఎప్పుడైనా చేయొచ్చు. ముందు ఆ 3 సాధించి మనిషివని నిరూపించుకో’ అని సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసింది.
నిన్న జెండా’ పేరుతో తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తున్న టీడీపీ-జనసేన ఉమ్మడి భారీ బహిరంగ సభలో పవన్ మాట్లాడాడు.ఈ సందర్భంగా ‘తన పెళ్లిళ్లపై వైసీపీ చేస్తున్న విమర్శలపై పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ.. ‘పవన్ అంటే మూడు పెళ్లిళ్లు. రెండు విడాకులు అంటారు. కాని జగన్ మాత్రం నాలుగు పెళ్లిళ్లు అంటాడు. మరి ఆ నాలుగో భార్య జగన్ ఏమో నాకు తెలీదు’ అంటూ సెటైర్లు వేశారు.