రాష్ట్రంలో సాగు నీరు లేక చేతికి అందివచ్చిన పంటలు ఎండిపోతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు సాగు నీరు అందించాలని రైతులు మరోసారి రోడ్డెక్కారు. నిర్మల్ జిల్లా కడెం మండలం నచ్చన ఎల్లాపూర్ గ్రామ రోడ్డుపై లింగాపూర్ గ్రామస్తులు, సుమారు ఒక 500 మందితో రైతులు ధర్నా చేపట్టారు.
దీంతో వాహనాలు సుమారు గంట నుంచి ట్రాఫిక్‌లోనే నిలిచిపోయాయి. ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కలెక్టర్ వచ్చేవరకు ధర్నా విరమించేది లేదని, తమకు న్యాయం జరిగే వరకూ ఇక్కడ నుండి కదిలే ప్రసక్తి లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు కదలబోమని రైతులు భీష్మించు కూర్చున్నారు.