రెచ్చిపోయిన నక్సల్స్‌.. అటవీశాఖ కార్యాలయం పేల్చివేత..!

-

జార్ఖండ్‌లో మావోయిస్టులు మ‌రోసారి క‌ల‌క‌లం సృష్టించారు. చైబాస జిల్లాలోని ముఫాసిల్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో అట‌వీశాఖ కార్యాల‌యాన్ని పేల్చివేశారు. జార్ఖండ్‌లో నక్సల్స్‌ మరోసారి రెచ్చిపోయి ముఫ్సిల్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో శనివారం రాత్రి అటవీ శాఖకు చెందిన కార్యాలయాన్ని పేల్చివేశారు. అంతేకాదు అక్కడే ఉన్న క్వార్టర్స్‌ను కూడా పేల్చేశారు. దీంతో అక్కడ ఉన్న భవనాలు కుప్పకూలాయి. అంతేకాదు అందులో ఉన్న వాహనాలు పూర్తిగా ధ్వంసమైయ్యాయి. ఈ సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది.

nacxols

అయితే పేలుగు సంభ‌వించిన‌ప్పుడు కార్యాల‌యంలో సిబ్బంది ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ఎవ‌రికీ ఏ హానీ జ‌రుగ‌లేదు. కానీ కార్యాల‌యంలో పార్క్ చేసి ఉన్న ఒక కారు, బైకులు కాలిపోయాయి. ఫ‌ర్నీచ‌ర్ ధ్వంస‌మ‌య్యింది. పేలుడు అనంతరం జార్ఖండ్ ప్ర‌భుత్వానికి, పోలీసుల‌కు హెచ్చ‌రిక‌లు చేస్తూ కూలిపోయిన గోడ‌ల‌కు పోస్ట‌ర్లు అంటించారు. భవనాలను పేల్చేసిన తర్వాత అక్కడ కొన్ని పోస్టర్లను కూడా అతికించారు. అందులో కొందర్ని హెచ్చరిస్తూ రాసినట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదని జార్ఖండ్‌ చైబాసా ఎస్పీ ఇంద్రజీత్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version