పెద్దపల్లి జిల్లాలో మళ్ళి లాక్ డౌన్ ..!

-

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో శనివారం ఒక్కరోజే 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. అంతే కాకుండా జిల్లాలో కరోనాతో ఒక్కరు మరణించారు. దింతో జిల్లా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో రేపటి నుంచి 10 రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు దాదాపు వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక పెద్దపల్లి జిల్లాలో కూడా రోజుకు పదుల సంఖ్యలో కేసులు వస్తున్నాయన్నారు.

lockdown

జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ మేరకు పురపాలక సంఘం కౌన్సిలర్లతో నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారు. పట్టణంలోని వ్యాపారులు కూడా స్వచ్ఛంద లాక్‌డౌన్ ఖచ్చితంగా పాటించాలన్నారు. నిత్యవసర వస్తువులు, కూరగాయలు మాత్రమే కొద్ది సమయం పాటు విక్రయించాలన్నారని పేర్కొన్నారు. అలాగే ప్రజలందరూ కూడా ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. కోవిడ్ బారిన పడకుండా ఉండాలంటే స్వీయ నియంత్రణ పాటించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version