రాజ్యసభలో ప్యానెల్ వైస్ చైర్మన్ గా పీటీ ఉష

-

గతేడాది పరుగుల రాణి పీటీ ఉషను రాజ్యసభకు కేంద్రం ప్రభుత్వం నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు రాజ్యసభలో ఆసక్తికర దృశ్యం నెలకొంది. ప్రస్తుతం పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా, ప్యానెల్ వైస్ చైర్మన్ హోదాలో రాజ్యసభను రాణి పీటీ ఉష నడిపించారు. ఇవాళ సభ జరుగుతుండగా, చైర్మన్ (భారత ఉపరాష్ట్రపతి) జగ్ దీప్ ధన్ కర్ గైర్హాజరీలో, సభాపతి ఆసనంలో పీటీ ఉష కూర్చున్నారు. పై పీటీ ఉష తన స్పందనను ట్విట్టర్ లో వెల్లడించారు.

శక్తిమంతమైన పదవి గొప్ప బాధ్యతను కలిగి ఉంటుందన్న అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్ వెల్ట్ వ్యాఖ్యలను ఆమె ఉదహరించారు. ఇవాళ వైస్ చైర్మన్ హోదాలో రాజ్యసభ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు తాను కూడా అదే అనుభూతికి లోనయ్యానని తెలిపారు. తన ప్రజలు తనపై ఉంచిన నమ్మకం, విశ్వాసంతో ఈ ప్రయాణంలో ఘనతలు అందుకోగలనంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు. అంతేకాదు, ఆమె ప్యానెల్ వైస్ చైర్మన్ జాబితాలోనూ స్థానం దక్కించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version