Breaking : నేడు ప్రమాణస్వీకారం చేయనున్న పీటీ ఉష

-

రాజ్యసభ సభ్యురాలుగా పీటీ ఉష నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు సమావేశమయ్యే రాజ్యసభ తొలి కార్యక్రమం ప్రమాణ స్వీకారోత్సవం. ప్రమాణ స్వీకారానికి ఢిల్లీ వచ్చిన పీటీ ఉష నిన్న బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. నేడు జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి పీటీ ఉష కుటుంబం కూడా హాజరుకానుంది. నామినేషన్ ద్వారా రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైన పీటీ ఉషకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

P T Usha requests Kerala CM to vaccinate state athletes taking part in  National Championships | Deccan Herald

రణ్‌దీప్ సింగ్ సుర్జోవాలా, పీ చిదంబరం, కపిల్ సిబిల్, ఆర్ గర్ల్ రాజన్, ఎస్ కళ్యాణ్ సుందరం, కేఆర్‌ఎన్ రాజేష్ కుమార్, అలీఖాన్, వీ విజయేంద్ర ప్రసాద్ తదితరులు కూడా పాల్గొంటారు. ఇదిలా ఉంటే.. మొన్న రాజ్యసభ సభ్యుడిగా మాజీ క్రికెటర్, టీమ్ ఇండియా మాజీ సభ్యుడు హర్భజన్ సింగ్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతీ, బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లాలు ప్రమాణం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version