ఇండియా లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధర లతో వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ దాటగా… డీజిల్ ధరలు కూడా… 100 దాటుతున్నాయి. ఇక తాజాగా దేశంలో మరోసారి పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగాయి.
పెరిగిన ధరల ప్రకారం… దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 104 .44 కు చేరగా డీజిల్ ధర రూ. 93 . 17 కు పెరిగింది. అలాగే హైదరాబాద్ నగరం లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108. 64 కు చేరగా డీజిల్ ధర రూ. 101. 66 కు పెరిగింది.
ముంబై లో రూ. 110. 41 , కు చేరగా డీజిల్ ధర రూ. 101. 03 కు పెరిగింది. కోల్ కతాలో రూ . 105. 09 కు చేరగా డీజిల్ ధర రూ. 96. 28 కు పెరిగింది. చెన్నైలో రూ . 101. 89 కు చేరగా డీజిల్ ధర రూ. 97. 69 కు పెరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 111. 08 కు చేరగా డీజిల్ ధర రూ. 101. 97 కు చేరుకుంది.