భూభారతితో ప్రజా సమస్యలు దూరం అవుతాయని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.గత ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన ధరణి చట్టంతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, నూతన భూ భారతి చట్టంతో వారి సమస్యలు దూరం కానున్నాయని అన్నారు.
బుధవారం వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట రైతు వేదికలో నిర్వహించిన భూభారతి అవగాహన కార్యక్రమానికి ఆది శ్రీనివాస్‌తో పాటు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ధరణి చట్టంతో రైతులు, ప్రజలు ఇబ్బంది పడ్డారని గుర్తుచేశారు. గత పదేండ్లు అసైన్డ్ కమిటీ లేకపోవడంతో ఇంకా చాలా కష్టాలు పడ్డారని వివరించారు. ధరణి ఇబ్బందులు దూరం చేయాలనే ఉద్దేశ్యంతో సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇతర మంత్రులు, నిపుణులు, అధికారులు భూ భారతి చట్టాన్ని రూపొందించారని వెల్లడించారు.