లేడీ అఘోరీని పోలీసులు మంగళవారం యూపీలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.అతని భార్య వర్షిణిని కూడా అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. అయితే, పూజల పేరుతో రూ.10 లక్షలు తీసుకుని లేడీ అఘోరీ మోసం చేసిందని, అడిగితే బెదిరిస్తున్నదని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు మోకిలా పోలీసులు చీటింగ్, బెదిరింపుల కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ముందుగా అఘోరీని అరెస్టు చేసి 2 గంటల పాటు విచారించారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తాజాగా అరెస్టుపై అఘోరీ మాట్లాడుతూ..చట్టం తన పని తాను చేసుకుపోతుందని, పోలీసులకు, కోర్టుకు సహకరిస్తున్నాని వెల్లడించింది. ప్రస్తుతానికి తానేమీ మాట్లాడనని, జైలుకు వెళ్లినా తన భార్య వర్షిణి తనతోనే ఉంటుందని వ్యాఖ్యానించింది. కాగా, తమ కూతురిని మాయమాటలతో లోబరుచుకుని, కేదార్ నాథ్ తీసుకెళ్లి బలవంతంగా అఘోరీ పెళ్లి చేసుకుందని వర్షిణి పేరెంట్స్ ఆరోపిస్తున్నారు.