పంజాబ్ కింగ్స్ షాకింగ్ డెసిషన్… రూ. 18 .5 కోట్ల ఆటగాడిపై వేటు!

-

ఈ మధ్యనే ముగిసిన ఐపీఎల్ సీజన్ 16 లో పంజాబ్ కింగ్స్ మరోసారి ప్లే ఆప్స్ కు కూడా చేరకుండా ఇంటి దారి పట్టింది. గత సంవత్సరం జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ జట్టు యాజమాన్యం ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ సామ్ కరన్ ను రూ. 18 .5 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఇతను ఆల్ రౌండర్ గా జట్టుకు విశేషమైన సేవలను అందిస్తాడని నమ్మకం పెట్టుకున్న యాజమాన్యానికి చివరికి సామ్ కరన్ నిరాశనే మిగిల్చాడు. దీనితో షాకింగ్ నిర్ణయం తీసుకునే దిశగా పంజాబ్ కింగ్స్ దూసుకు వెళుతోంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం వచ్చే ఐపీఎల్ సీజన్ 17 కు జట్టు నుండి పక్కన పెట్టే దిశగా ఆలోచిస్తున్నారట. కొన్ని మ్యాచ్ లకు కెప్టెన్సీ చేసే అవకాశం వచ్చినా సరిగా రాణించలేకపోయాడు.

ఇలాగే జరిగితే సామ్ కరన్ ను ఏ జట్టు కూడా తీసుకోవడానికి ముందుకు రారు నాదంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతానికి ఇది ఊహాజనిత సమాచారం మాత్రమే.. మరి నిజం కానుందా అన్నది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version