2 లక్షలకు పైగా ఓట్ల ఆదిక్యంలో పురందీశ్వరి

-

అసెంబ్లీ ఫలితాలు, పార్లమెంటు పలితాలలోను కూటమి విజయ దుందుభి కొనసాగిస్తుంది.ఈ ఎన్నికల్లో కూటమి రాజమండ్రి బీజేపీ అభ్యర్థి పురందీశ్వరికి ఇప్పటికే 2 లక్షల మెజార్టీ దాటింది. ప్రస్తుతం ఆమె 2,05,531 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక శ్రీకాకుళం, విశాఖ పట్నం, అమలాపురం, విజయవాడ, గుంటూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థులు లక్ష పైన మెజార్టీలతో కొనసాగుతున్నారు

మరోవైపు….ఈ ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేసిన టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ రికార్డు మెజార్టీ దిశగా వెళ్తున్నారు. ఇప్పటివరకు ఆయనకు 3,44,736 ఓట్లు పోలవగా 1,58,185 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తన పదునైన మాటలతో వైసీపీపై విరుచుకుపడ్డ ఈ ఎన్నారై.. ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్గా నిలిచారు. వైసీపీ అభ్యర్థి కిలారి రోశయ్య కు ఇప్పటివరకు 1,86,551 ఓట్లు పోలయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version