తక్కువే ఎక్కువ.. మినిమలిజం గురించి పూరి జగన్నాథ్ చెప్పిన మాటలు..

-

పూరీ మ్యూజింగ్స్ పేరుతో పాడ్ కాస్ట్ మొదలెట్టి తన ఆలోచనలను, అభిప్రాయాలను అందరితో పంచుకుంటున్న పూరీ జగన్నాథ్, తాజాగా మినిమలిజం అనే కాన్సెప్టుని పరిచయం చేసారు. మినిమలిజం అంటే తక్కువే ఎక్కువగా ఫీలవడం. అదేంటని ఆశ్చర్యపోతున్నారా? పూరి జగన్నాథ్ మాటల్లో మినిమలిజం ఫాలో అయ్యే వ్యక్తి ఎలా ఉంటాడంటే, అతడికి పెద్దగా బట్టలు ఉండవు. వారానికి సరిపడా ఏడు జతల బట్టలు మాత్రమే ఉంచుకుంటాడు.

ఫోన్ వాడుతుంటే అది పాడైపోయి ఇక పనికిరాదు అనేంత వరకూ వాడుతూనే ఉంటాడు. పాతదైపోయింది కదా అని చెప్పి పారవేసి కొత్తది కొనాలని అనుకోడు. చిన్న ఇంట్లో ఉంటాడు. తక్కువే ఎక్కువ అన్న ఆనందంలో వాళ్ళు బ్రతుకుతారు. ఆర్థికంగా ఎవరి దగ్గర అప్పులు చేయరు. వాళ్ళ దగ్గర ఏముంటుందో దానితోనే సంతోషంగా ఫీల్ అవుతారు. అనవసరమైన బరువులు మోయరు. అందుకే పెళ్ళి చేసుకోరు. అదొక్కటి కమిట్ అయితే పైవన్నీ సాధ్యం కావని వారికి తెలుసు.

మెటీరియల్ వస్తువులకి సమయం ఇవ్వరు. బంధాల్లో క్వాలిటీ టైమ్ గడుపుతారు. జీవితంలోని ప్రతీ చిన్న విషయాన్ని ఆనందిస్తారు. వాళ్ళు ఎవరికీ బరువు కారు. అలాగే మరొకరి బరువును వాళ్ళు మోయరు. అందుకే ఆరోగ్యంగా ఉంటారు. ఐతే ఇలా ఉండేవారు చాలా బాధపడతారని జీవితంలో చాలా కోల్పోతారని అనుకుంటారు. కానీ వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు.

ఎన్నో డబ్బులు సంపాదించి, పెద్ద పెద్ద కంపెనీ సామ్రాజ్యాలను స్థాపించిన తర్వాత చాలా మందికి కలిగే ఫీలింగ్ మినిమలిజం. గౌతమ బుద్ధ ఒక మినిమలిస్టు. ఎన్ని సంపాదించినా ఎన్ని విజయాలు పొందినా చివరికి అందరూ అలవాటు చేసుకోవల్సింది మినిమలిజమ్ అనీ, అది ఇప్పటి నుండే అలవాటు చేసుకుంటే బాగుంటుందని పూరీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version