ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ ఆరవ సీజన్ కొనసాగుతోంది. అందులో ఊహించని సంఘటనలు, ప్రేమ కహానీలు , రొమాన్స్, గొడవలు, కొత్త కొత్త టాస్కులు , రకరకాల ఎమోషన్స్ అన్ని కనిపించి ఆద్యంతం ఆసక్తికరంగా మారుస్తున్నారు బిగ్ బాస్ నిర్వహకులు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఎనిమిదవ వారం ఓటింగ్ ఎలా జరిగింది? డేంజర్ జోన్ లో ఎవరున్నారు? ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ? అనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఎట్టకేలకు రేపు సాయంత్రం టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనే విషయం స్పష్టం అవుతుందని చెప్పవచ్చు. కానీ ఆడిషన్స్ అంచనాల ప్రకారం ఎనిమిదో వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో ఇప్పుడు ఒకసారి చూసి తెలుసుకుందాం.
ఆరో సీజన్లో అర్జున్ కళ్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, కీర్తి భట్ , సుదీపా పింకీ , శ్రీహాన్, నేహా చౌదరి , చలాకి చంటి, రోహిత్, మెరీనా , బాలాదిత్య, వాసంతి, షానీ, ఇనయ, శ్రీ సత్య, ఆర్జె సూర్యా, ఫైమా, ఆది రెడ్డి, రాజశేఖర్, ఆరోహీ, రేవంత్, అర్జున్ లు వచ్చారు. అయితే ఇప్పటికీ ఏడు వారాలను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ నుంచి ఏడు మంది కంటెస్టెంట్లు కూడా హెల్మెట్ అయ్యారు . అందులో షాని, అభినయశ్రీ , నేహా, చంటి, సుదీప, అర్జున్లు వెళ్లిపోయారు. ఇప్పుడు ఇంట్లో ఉన్న వారిలో 14 మంది నామినేట్ అయ్యారు. వారిలో ఇనయా , బాలాదిత్య, గీతూ, ఆదిరెడ్డి, శ్రీహాన్, శ్రీ సత్య, ఫైమా, రేవంత్ , వాసంతి, మెరీనా, రాజశేఖర్ ,రోహిత్, ఆర్ జె సూర్య లు నామినేట్ అవ్వడం జరిగింది.
దీంతో ఈ వారం ఆట తీరును బట్టి కాకుండా ఫేమ్ ని బట్టి ఓటింగ్ జరుగుతుందని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఈ వారం ఓటింగ్ ఎన్నో ట్విస్టులతో సాగింది. దీంతో మొదటి ఇద్దరి స్థానాలు తప్ప అందరివి మారిపోయాయి. పోలింగ్ ముగిసే సమయానికి టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన రేవంత్ ఎక్కువ ఓట్లు సాధించి, టాప్ ప్లేస్ లో నిలిచాడు. అలాగే మరో స్ట్రాంగ్ ప్లేయర్ రెండవ స్థానంలో ఉన్నాడు. వీళ్ళిద్దరికీ దాదాపు 30 శాతం పైగా ఓటింగ్ వచ్చినట్లు సమాచారం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం .. మేరీనాతో ప్రవర్తించిన తీరుతో ఫైమాకు ఓటింగ్ తగ్గిపోయింది. ఏది ఏమైనా ఈ వారం ఫైమా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.