Pushpa 2: పుష్ప-2 రిలీజ్ డేట్ ఇదే…

-

లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప-2 . ఈ సినిమాలో రష్మిక మందాన్న కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అయితే లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ లో ఉండడంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా ఆగస్టులో రిలీజ్ అవుతుందని, ఆగస్టులో రిలీజ్ అవ్వాల్సిన పుష్ప 2 నీ వాయిదా వేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది.

 

తాజాగా ఈ పుకార్లపైన మూవీ టీం స్పందించింది. ఈ వార్తల్లో నిజం లేదని, ఈ ఏడాది ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. పుష్ప-ది రైజ్ పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు దానికి సీక్వెల్గా పుష్ప-ది రూల్ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో తగ్గేదేలే అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో మనకు తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version