ఇండస్ట్రీలో వరుసగా విషాదలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలామంది ప్రముఖులు… రకరకాల కారణాల వల్ల మరణించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇండస్ట్రీలో.. ప్రముఖ సీనియర్ నటి మరణించారు. ప్రముఖ సీనియర్ నటి పుష్పలత… తాజాగా మృతి చెందారు. తీవ్ర అనారోగ్యంతో ఆమె మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.
87 సంవత్సరాలు ఉన్న సీనియర్ నటి పుష్పలత… గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే… ఈ అనారోగ్యం కారణంగా చెన్నైలోని తన నివాసంలో పుష్పలత మరణించారు. తెలుగు, తమిళం, మలయాళం అలాగే కన్నడ భాషల్లో 100కు పైగా సినిమాలు చేశారు నటి పుష్పలత.
ముఖ్యంగా మన తెలుగు ఇండస్ట్రీలో… చెడపకురా చెడేవు, ఆడబిడ్డ, రాము, యుగపురుషుడు, వేటగాడు లాంటి చాలా సినిమాలు చేశారు నటి పుష్పలత. ఇక నటి పుష్పలత కూతురు కూడా ఇండస్ట్రీలో రానిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సీనియర్ నటి పుష్పలత మరణించిన నేపథ్యంలో చాలామంది ప్రముఖ నటీనటులు సంతాపం తెలుపుతున్నారు.