కుల గణన పద్ధతిగా జరిగింది. మూడు కోట్ల మందిని అప్రోచ్ కావడం ఆషామాషీ కాదు అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సమగ్ర సర్వే చేసినప్పుడు నేను సిట్టింగ్ ఎమ్మెల్యే. కానీ ఎక్కడా.. ఆ నివేదిక ఇవ్వలేదు.. పబ్లిక్ డొమైన్ లో లేదు. ఇప్పుడు..అప్పుడే మేము చేశాం అంటే ఏం అర్ధం ఉంది అని ప్రశ్నించారు. అలాగే సెన్సెస్ చేయమంటే కేంద్రం చేయదు. డేటా ఆధారంగా రేషన్ కార్డు.. ఇండ్లు ఇవ్వడానికి దోహద పడుతుంది అని ఉత్తమ్ అన్నారు.
అలాగే సమగ్ర సర్వే.. లో 51 శాతం లో మైనార్టీ లు ఉన్నారు. మేము ముస్లిం యాడ్ చేస్తే 56 శాతం అయ్యారు. BRS సర్వే కంటే..మా సర్వేలో బీసీ జనాభా పెరిగింది. Brs సర్వేలో Ocలు ఎక్కువగా ఉండే. అయితే మేము కాంగ్రెస్ సైనికులం. రాహుల్ గాంధీ అనుచరులం. సబ్ కమిటీ లో ఉత్తమ్ ఎందుకు ఉన్నాడు అని అంటున్నారు. మాకు పర్సనల్ అజెండా లేదు. పార్టీ నిర్ణయమే మాకు ఫైనల్ అని ఉత్తమ్ తెలిపారు.