చర్చలకు రష్యా రెడీగా లేదు : అమెరికా

-

ఉక్రెయిన్ తో చర్చల విషయంలో రష్యా సుముఖత చూపడం లేదన తాజాగా అమెరికా ఆరోపించింది. రష్యాతో దౌత్యపర ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని మార్గాలను పరిశీలిస్తున్నట్లు తెలిపింది. కానీ.. చర్చల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపకుండా ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ వ్యతిరేక దిశలో వెళ్తున్నారని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఆరోపించారు. ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి క్యాథరీన్ కొలోనాతో కలిసి విలేకరులతో మాట్లాడారు.

‘దౌత్య చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. కానీ, రష్యా ప్రస్తుతం ఉక్రెయిన్ దురాక్రమణను నిలిపేసేందుకు సిద్ధంగా ఉందనే దానికి ఎటువంటి ఆధారాలు లేవు. పైగా దాడుల విషయంలో దూకుడును ప్రదర్శిస్తోంది’ అని బ్లింకెన్‌ విమర్శించారు.

యుద్ధాన్ని ముగించే మార్గాలపై అమెరికా లేదా టర్కీతో చర్చల విషయంలో సిద్ధంగా ఉన్నట్లు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బ్లింకెన్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version