వామనరావు మర్డర్ కేసు.. పుట్ట మధు సంచలన వ్యాఖ్యలు !

Join Our Community
follow manalokam on social media

న్యాయవాది దంపతులు అయిన వామనరావు ఆయన భార్య మర్డర్ కేసు వెనుక పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్ట మధు ఉన్నారని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో అడ్వకేట్ వామనరావు దంపతుల హత్యపై తొలిసారి స్పందించారు మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు. తన ఎదుగుదల ఓర్వలేకనే మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వామన్ రావు హత్య కేసును మీడియా ఇన్వెస్టిగేషన్ చేస్తుందా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తుందా??? అని ఫోర్త్ ఎస్టేట్ గా బావించే మీడియా ఒకసారి ఆలోచించాలని ఆయన అన్నారు.

కొంతమంది ఎప్పుడు పుట్ట మధును అరెస్టు చేస్తారని చూస్తున్నారని పేర్కొన్న ఆయన పేద బిడ్డ జడ్పీ చైర్మన్ అయితే సహించలేక పోతున్నారు అని అన్నారు. పోలీసు విచారణ తర్వాత వాస్తవాలతో హైదరాబాద్లో మీడియా ముందుకు వస్తాను అని ఆయన అన్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు నేను రౌడీయిజం చేసినట్లు చెబుతున్నాడని అసలు దొంగ రౌడీయిజం చేసింది శ్రీధర్ బాబు ఆయన తమ్ముడే అని మధు పేర్కొన్నారు. 

TOP STORIES

నీ లోపలి బాధలే కాదు, నీ బయట ఏం జరుగుతుందో తెలుసుకోకుంటే అలాగే మిగిలిపోతావని తెలిపే కథ..

ఒక కొండమీద నివాసముండే అమ్మాయి నీళ్ళకోసం కొండదిగి నది వద్దకు వస్తూంటుంది. భుజం మీద కావిడి పట్టుకుని రెండు కుండల్లో నీళ్ళు పట్టుకుని కొండమీదకి వెళ్తుండేది....