తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా బిజీ షెడ్యూల్ మెయింటేన్ చేస్తున్నారు. రెండ్రోజుల కిందట ఢిల్లీకి వెళ్లిన ఆయన మరల తిరిగొచ్చాక అసెంబ్లీలో గవర్నర్‌కు ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టాక దానిపై మాట్లాడేందుకు హాజరయ్యారు.
ఆదివారం రోజున స్టేషన్ ఘనపూర్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. అంతకుముందు రూ.600 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఇదిలాఉండగా, సోమవారం ఉదయం సినీ దర్శకుడు, నటుడు ఆర్ నారాయణమూర్తి.. సీఎం రేవంత్‌ను జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంట్లోనే మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నారాయణమూర్తిని సీఎం రేవంత్ శాలువాతో సత్కరించి, తెలంగాణ తల్లి చిత్రపటం బహుమతిగా అందజేశారు.