అనంతపురం : ఓటీటీలపై మరోసారి ప్రముఖ సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓటిటిలో క్రేజీ ఉన్న సినిమాలకు మాత్రమే చోటు ఉంటుందని పేర్కొన్నారు ఆర్.నారాయణమూర్తి…20 శాతం మంది మాత్రమే ఓటిటి లో సినిమాలు చూస్తారని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసుకుని థియేటర్లు ఓపెన్ చేసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
థియేటర్లు ఓపెన్ చేస్తేనే సామాన్యులు సినిమాలను చూసే అవకాశం ఉంటుందని.. ఓటిటి సామాన్యులకు అందుబాటులో ఉండదన్నారు. కేంద్ర వ్యవసాయ చట్టాలు రైతులకు వరాలు కాదు శాపాలు అని మండిపడ్డారు. చట్టాల వల్ల రైతు సంక్షేమ పథకాలు రద్దు అవుతాయి… కార్పొరేట్ వ్యక్తుల చేతుల్లోకి పోతాయన్నారు. వ్యాపారుల చేతుల్లోకి పోతే రైతులు, వినియోగదారులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పారు.
గిట్టుబాటు ధర లేక పోవడం వల్ల రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని.. స్వామి నాథన్ సిఫార్సులు అమలు చేస్తేనే రైతులకు గిట్టుబాటు ధర వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ చట్టాలు చేయడం కాదు రైతులు. పండించిన పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించాలని.. రైతుల కష్ట నష్టాల కోసమే రైతన్న సినిమా అని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ వ్యవసాయ చట్టాలను రద్దు చేసి స్వామి నాథన్ కమిటీ సిఫారసు లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.