కేసీఆర్ సర్కార్‌పై ఆర్ఎస్‌ ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు

-

బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ [ఐ నిప్పుల వర్షం కురిపించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం రియల్​ ఎస్టేట్​ వ్యాపారుల చేతుల్లో బందీ అయ్యిందని మండిపడ్డారు. హైదరాబాద్​ చుట్టుపక్కల వేల ఎకరాల భూములను అక్రమంగా కొనుగోలు చేసిన కేసీఆర్ బినామీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నేతలు, సినీ ప్రముఖుల మెప్పు కోసమే 111 జీవో ను ఎత్తివేశారని అన్నారు ఆయన. 111 జీవో ఎత్తివేయడం వల్ల ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలు పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని ఒక ప్రకటనలో ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

కాకతీయ యూనివర్సిటీ భూముల ఆక్రమణ వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని అన్నారు ఆయన. యూనివర్సిటీ భూములను కాపాడాల్సిన పోలీసులే రాజకీయ నేతల అండతో దర్జాగా కబ్జా చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తపరిచారు. వెంటనే ప్రభుత్వం స్పందించి వర్సిటీ భూముల ఆక్రమణపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపాలని వెల్లడించారు ప్రవీణ్ కుమార్. భూ అక్రమార్కులపై చర్యలు తీసుకోని పక్షంలో కాకతీయ యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం బీఎస్పీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలియచేశారు ప్రవీణ్ కుమార్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version