సందర్భం : విశ్వకవి జయంతి నేడు
మనం ప్రపంచాన్ని తప్పుగా చదువుతాం
చివరికి అది మనల్ని మోసం చేసిందని బాధపడతాం
– రవీంద్రనాథ్ ఠాగూర్
ఈ ప్రపంచం మనల్ని పాక్షికంగానో సంపూర్ణంగానో అర్థం చేసుకోవడం సాధ్యం కాని పని కొన్ని వేల గొంతులను కలిపి చూడండి అవి వినిపించే ఏకతా రాగం కూడా ఒక అపసవ్యత సంకేతంగానో సామీప్యంగానో ఉండవొచ్చు.. మన జీవితాల్లో నిష్కంళకత అన్నది లేదు ఉండదు కూడా ఉంది అని చెప్పుకుని తిరిగే ఓ చిన్న సందర్భంలో మా రాజులంతా మనసున్నోళ్లు.. మనసున్నోళ్లంతా మారాజులు.. నిద్రలేమి తనం ఒకటి జీవితాన్ని వెన్నాడుతోంది.. అనిపించినప్పుడు కూడా కలలను అరువు తెచ్చుకుని రెప్పల ఆకాశం కింద దాపెట్టడం మనిషికి మాత్రమే చేతనయిన పని..
ఒక గుండె అభిలాష పదిమందికీ బ్రతుకైనది అని-అవుతుందని విన్నాను ఓ సినీ కవి మాట ఇది.. ఇప్పటిలో మనుషుల్లో ఈ తరహా అభిలాషలను తొంగి చూడడం మహా పాపం.. కనుక నిర్ణిద్రను ప్రేమించడం ఘోరం.. ఒకానొక హేయమైన చర్య దగ్గర మీరూ నేనూ అంతా సర్వం సమానం.. లేదిక ఈ పాపానికి పరిహారం లేదా ప్రాయిశ్చిత్తం.. పశ్చాత్తాప చింతన జీవిత కాలం వెన్నాడుతున్న వేళ ప్రేమ కూడా పాప పరిహారంలో భాగమే..ఆ పంకిలాన్ని వదిలించుకోవడమే మేలు.. దేహంలోనూ హృదయంలోనూ ఎవ్వరూ ఎక్కడా ఎలానూ దాగుండడం అస్సలు కుదరని పని!
– రత్నకిశోర్ శంభుమహంతి