ATM చోరీకి యత్నించిన దొంగ.. 5 నిమిషాల్లో పట్టేసుకున్న పోలీసులు

-

హైదరాబాద్ మౌలాలీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి ఏటీఎంలో చోరీ చేయడానికి వెళ్లాడు. ఈ సమాచారం అందుకున్న రాచకొండ పోలీసులు.. కేవలం 5 నిమిషాల్లోనే అక్కడికి చేరుకుని ఆ దొంగను పట్టుకున్నారు. చోరీ చేయకుండా అడ్డుకున్నారు. అసలేం జరిగిందంటే..?

మౌలాలిలోని ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి 12.15 గంటల సమయంలో అలికిడి రావడంతో బ్యాంకు మెయిన్‌ సర్వర్‌కు సిగ్నల్స్‌ వెళ్లాయి. బ్యాంకు అధికారులు డయల్‌ 100కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఇన్‌స్పెక్టర్‌, ఎస్సైలు, అదే ఏరియాలో ఉన్న పెట్రోలింగ్‌ సిబ్బందిని అప్రమత్తం చేశారు. వారు ఏటీఎం కేంద్రం వద్దకు ఐదు నిమిషాల్లోపే చేరుకున్నారు.

ఏటీఎం లోపల ఒక వ్యక్తి ఏటీఎంను తెరిచేందుకు యత్నిస్తూ కనిపించాడు. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని విచారించారు. నిందితుడు ఛత్తీస్​గఢ్​కు చెందిన పంకజ్ కుమార్ అని.. మౌలాలీలో కొంతకాలంగా నివాసముంటున్నాడని గుర్తించారు. రాత్రిపూట ఏటీఎం వద్ద ఎవరూ లేకపోవడంతో చోరీకి యత్నించినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version