ఎమ్మెల్సీ ఎన్నికల అంతరం ఏపీలో రాజకీయాలు మంచి ఊపందుకున్నాయి. ఆ ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ అధిష్టానం ఇద్దరు ఎమ్మెల్యేలను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఆ తర్వాత నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ నాయకుడు మన్నెమాల సుకుమార్ రెడ్డిని సైతం వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేసింది. కాగా సస్పెండ్ చేసిన అనంతరం సుకుమార్ రెడ్డి ఈ విషయంపై స్పందించింది లేదు. ఈ రోజు నెల్లూరు లోని ఉత్తమ హోటల్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చారు. కానీ తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ మీడియా సమావేశం రద్దు చేసుకున్నట్లు వినిపిస్తోంది.