నేడే ఉప రాష్ట్రపతి ఎన్నిక ఉండనుంది. ఇవాళ ఉదయం 10 గంటలకు ఉప రాష్ట్రపతి ఎన్నిక ప్రారంభం కానుంది. ఇక ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ ముగియనుంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఎన్డీయే అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి తరఫున జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు.

లోక్‌సభ, రాజ్యసభ కలిపి మొత్తం 786 ఓట్లు ఉండగా.. 394 ఓట్లు వచ్చినవారు వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నిక అవుతారు. ప్రస్తుతం ఎన్డీయేకి 425, ఇండియా కూటమికి 324 మంది సభ్యులు ఉన్నారు. అంటే దాదాపుగా ఎన్డీయే అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.