RADHE SHYAM : ప్రభాస్‌ ఫ్యాన్‌ కు గుడ్‌ న్యూస్‌… సంక్రాంతి బరిలో రాధేశ్యామ్‌

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, తన చేతిలో నాలుగు సినిమాలు పెట్టుకున్నాడు. రాధేశ్యామ్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఇంకా పేరు పెట్టని సినిమా, కేజీఎఫ్ దర్శకుడి దర్శకత్వంలో రూపొందనున్న సలార్. ఇక సాహో త‌ర్వాత ప్రభాస్‌, పూజా హెగ్డే కాంబినేషన్ లో జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో రాధే శ్యామ్ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కూడా అల్‌ మోస్ట్‌ పూర్తయినట్లనట. అయితే… పీరియాడికల్ రొమాంటిక్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

ఈ సినిమాలో ప్రభాస్ పూజా హెగ్డే విక్రమాదిత్య, ప్రేరణ పాత్రల్లో ఒదిగిపోనున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన మూవీఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు పెంచేసింది. ఇక తాజాగా ఈ సినిమా సంబంధించిన మరో అప్డేట్‌ వచ్చేసింది. ఈ సినిమాను 2021 జనవరి 14న రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం.

అంటే సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నారు. దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ ను కాసేపటి క్రితమే రిలీజ్‌ చేసింది ఈ చిత్ర బృందం. ఇక ఈ పోస్టర్‌ లో ప్రభాస్‌ క్లాసీ స్టైల్‌ లో నడుచుకుంటూ.. గ్లామర్‌ లుక్‌ లో కనిపించాడు. ఈ తాజా అప్డేట్‌ తో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ లో కొత్త ఉత్సాహం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version