రాఘవేంద్ర రావు బి.ఎ అంటే బొడ్డు మీద ఆపీల్.. నవ్వులు పూయించిన అన్‌స్టాపబుల్‌ ప్రోమో..

-

ప్రతి వారం అన్‌స్టాపబుల్‌ 2 టాక్‌ షోతో ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు నందమూరి బాలకృష్ణ. ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఆ కార్యక్రమ తాజా ఎపిసోడ్‌కు దర్శక దిగ్గజం రాఘవేంద్రరావు, నిర్మాతలు డి.సురేశ్‌ బాబు, అల్లు అరవింద్‌ అతిథులుగా వచ్చారు. తెలుగు సినిమా’కు 90 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ స్పెషల్ ఎపిసోడ్‌ను రూపొందించారు.. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలై ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

వెంకీ బన్నీతో చెప్పుకోలేని కష్టాలు.. సురేష్ బాబు గురించి చెబుతూ అల్లు అరవింద్ ‘ఆయన వెజిటేరియన్’ అని అనగా… బాలయ్య అందుకుని ‘అంటే మీలో ఉన్న మ్యూజిక్ ఆయనలో లేదా’ అంటూ నవ్వులు పూయించారు. ఇదే సమయంలో వెంకీ, బన్నీల ప్రస్తావనా తీసుకొచ్చారు బాలయ్య. ‘వాళ్లతో ఎలా వేగుతున్నారు’ అని ప్రశ్నించగా…’చెప్పుకోలేని కష్టాలు కొన్ని ఉంటాయ్’ అని ఫన్నీగా బదులిచ్చారు అల్లు అరవింద్. తెలుగు సినిమా ప్రత్యేకతేంటి అని ఆసక్తికర ప్రశ్న అడిగారు బాలయ్య. దీనికి సురేష్ బాబు ‘తెలుగు సినిమా థాలీ మీల్స్ లాంటిది’ అని ఆన్సర్ ఇచ్చారు. ఆ తర్వాత దిగ్గజ దర్శకుడు రాఘవేంద్ర రావు స్టేజ్ మీదకు వచ్చీ రాగానే పంచ్ వేశారు. ‘జీవితమంతా ఈ ఇద్దరి మధ్యనే శాండ్‌విచ్‌ అయి ఉన్నాను. మళ్లీ ఇక్కడ కూడా వీళ్లేనా’ అంటూ నవ్వించారు. ‘రాఘవేంద్ర రావు బీఏ అంటే ఏంటో తెలుసా. బొడ్డు మీద యాపిల్ అని అర్థం’ అని అల్లు అరవింద్ కామెడీ చేశారు. అయితే రాఘవేంద్ర రావు కూడా తిరిగి పంచ్‌ల మీద పంచ్‌లు వదిలారు. ‘న్యూటన్ యాపిల్ పడినప్పుడు గ్రావిటీ కనిపెట్టాడు. నేను ఎక్కడ పడాలో కనిపెట్టాను’ అంటూ ఫన్నీగా కితకితలు పెట్టించారు. అలాగే నెపోటిజం గురించీ బాలయ్య ప్రశ్నించగా…’ఇది చెప్పినందుకు నన్ను తప్పకుండా ట్రోల్ చేస్తారు’ అని అల్లు అరవింద్ అన్నారు. మరి ఆయన ఏం చెప్పారో తెలుసుకోవాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version