రాఘవేంద్రరావు మరో ‘పెళ్లిసందడి’…!

-

డివోషనల్‌ ట్రాక్‌లోకి వెళ్లిన రాఘవేంద్రరావు మళ్లీ ఓల్డ్‌ స్టైల్‌లోకి వచ్చేస్తున్నాడు. ఈ సీనియర్ డైరెక్టర్‌ మళ్లీ పూల తోటలని, పండ్ల తోటలని లీజుకి తీసుకుంటున్నాడు. మరో ‘పెళ్లిసందడి’ చూపించబోతున్నాడు కె.రాఘవేంద్రరావు. మరి ఈ కొత్త ‘పెళ్లి సందడి’లో హీరో ఎవరు అనేదానికి ఇంట్రెస్టింగ్‌ ఆన్సర్స్‌ వినిపిస్తున్నాయి.

రాఘవేంద్రరావు కమర్షియల్‌ మూవీస్‌ని పక్కనపెట్టి పదేళ్లు అవుతోంది. 2010లో వచ్చిన ‘ఝుమ్మంది నాదం’ తర్వాత మళ్లీ కమర్షియల్‌ మూవీస్‌ తియ్యలేదు రాఘవేంద్రరావు. ‘శిరిడి సాయి, ఓం నమో వెంకటేశాయ’ లాంటి భక్తి సినిమాలే చేశాడు. అయితే మళ్లీ ఇప్పుడీ దర్శకుడు తన మార్క్ పూలు, పండ్ల సినిమా తియ్యబోతున్నాడు.

రాఘవేంద్రరావు ‘పెళ్లి సందడి’ మళ్లీ మొదలవ్వబోతోందని ఒక వీడియో రిలీజ్‌ చేశాడు. ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ స్టార్ట్ అయ్యిందని, మ్యూజిక్ సెషన్స్‌ కూడా మొదలయ్యాయని తెలిపాడు. అయితే స్టార్‌ క్యాస్టింగ్‌ని మాత్రం రివీల్ చెయ్యలేదు. కానీ సినీజనాలు మాత్రం శ్రీకాంత్‌ కొడుకు రోషన్‌ని హీరోగా తీసుకుంటాడేమో అని కామెంట్‌ చేస్తున్నారు.

రాఘవేంద్రరావు 24 ఏళ్ల క్రితం శ్రీకాంత్‌, దీప్తీ భట్నాగర్, రవళితో ‘పెళ్లి సందడి’ సినిమా తీశాడు. ఈ మూవీ అప్పట్లో ఒక ట్రెండ్‌ సృష్టించింది. సో అప్పటి ‘పెళ్లి సందడి’లో తండ్రి హీరోగా చేశాడు కాబట్టి, ఇప్పటి ‘పెళ్లి సందడి’లో కొడుకు హీరోగా చేస్తే కంటిన్యుటీ ఉంటుందని కామెంట్ చేస్తున్నారు జనాలు. రోషన్ ఆల్రెడీ ‘నిర్మలా కాన్వెంట్’ అనే సినిమా కూడా చేశాడు. మరి రాఘవేంద్రరావు శ్రీకాంత్‌ కొడుకుతోనే ఈ ‘పెళ్లి సందడి’ని తెరకెక్కిస్తాడా లేక మరో ఆప్షన్‌ని చూసుకుంటాడా అన్నది తెలియాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version