మరోసారి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు వైసీపీపై సంచల వ్యాఖ్యలు చేసారు.. రాష్ట్రంలో శాంతిభద్రతలు కల్పించలేని ప్రభుత్వం.. ప్రభుత్వమే కాదని రఘురామకృష్ణ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో నిత్యం ఎన్నో ఘోరాలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో లేని చట్టాల గురించి వైకాపా నేతలు మాట్లాడుతున్నారని రఘురామకృష్ణ విమర్శించారు. “ఏపీలో ఎక్కువ నేరాలు జరుగుతున్నట్లు క్రైం రికార్డ్స్ బ్యూరో నివేదికలో వెల్లడైందని, మహిళలపై నేరాల్లో 2020లో ఏపీ 8వ స్థానంలో ఉంటే… పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల ఘటనల్లో 2వ స్థానంలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
మహిళలపై భౌతికదాడుల విషయంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని, 2019తో పోల్చితే రాష్ట్రంలో నేరాల పెరుగుదల 63 శాతంగా నమోదైందన్నారు. 2021లో అత్యధిక లాకప్ లు ఏపీలోనే జరిగాయన్న రఘురామకృష్ణ.. అదృష్టం బాగుండి నేను బయటపడ్డానంటూ.. ధ్వజమెత్తారు. ప్రపంచ బ్యాంకు అప్పు ఇచ్చినా రాష్ట్రం అప్పులు తీరవు. 175 సీట్లు వస్తాయని అంటున్నారు.. కానీ… 17 సీట్లు రావడమే కష్టమన్న రఘురామ.. వైసీపీలో ప్రక్షాళన జరగాలన్నారు.