న్యూఢిల్లీ: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో లేఖ రాశారు. ఇప్పటికే పలు సమస్యలపై జగన్‌కు చాలాసార్లు లేఖలు రాశారు. ఇప్పుడు తాజాగా మరోసారి లేఖ సంధించారు. ఏపీ మెడికల్ కౌన్సిల్, ఏపీహెచ్ఎంహెచ్ఐడీసీలకు అధిపతులుగా తగిన అనుభవంలేని ఇద్దరు తెలంగాణ వైద్యులను నియమించారని లేఖలో రఘురామ పేర్కొన్నారు. వైద్య సంబంధిత సంస్థలకు అధిపతులుగా పక్క రాష్ట్రాల వైద్యులను కాకుండా ఏపీ పరిస్థితులు తెలిసిన స్థానిక వైద్యులను నియమించాలని సూచించారు. కనీసం మంచి వైద్యులైనా ఇక్కడ ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు.
జగన్‌కు రఘురామ మరో లేఖ
-