వైసీపీ ఓడిపోవడం ఖాయం : ఎంపీ రఘురామ కృష్ణంరాజు

-

మరోసారి వైసీపీ సంచలన వ్యాఖ్యలు చేశారు నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనను పోలీసులు అడ్డుకోవడంపై స్పందించారు. చంద్రబాబు కాన్వాయ్‌కు అడ్డుపడి మరీ పోలీసులు పర్యటనను అడ్డుకోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను తాను ఎప్పుడూ చూడలేదని రఘురామ కృష్ణంరాజు చెప్పుకొచ్చారు. ఈ ఘటనలను చంద్రబాబుపై దాడిగానే పరిగణించాలని వ్యాఖ్యానించారు రఘురామ కృష్ణంరాజు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ తనను తాను సింహంగా అభివర్ణించుకుంటారని.. సింహం ఎవరో అనపర్తిలో తెలిసిపోయిందని సెటైర్లు వేశారు. పరదాల చాటున వచ్చేవారిని సింహం అంటారా…? అని సందేహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు సింహం కాబట్టే వైసీపీ ప్రభుత్వం భయపడి పర్యటనలను అడ్డుకుంటుందని ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో వైసీపీ దారుణంగా ఓడిపోవడం ఖాయమని ఎంపీ రఘురామ జోస్యం చెప్పారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి కనీసం 25 సీట్లు కూడా వచ్చే అవకాశాలు కనిపించడం లేదని చెప్పుకొచ్చారు. ఇప్పటికే సర్వేలు సైతం అవే చెబుతున్నాయని దీంతో సీఎం జగన్ క్యాడర్ ఫ్రస్టేషన్‌లోకి వెళ్లిపోయి చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటున్నారని అసమ్మతి ఆరోపించారు రఘురామ కృష్ణంరాజు.

Read more RELATED
Recommended to you

Exit mobile version