వైఎస్ మరణం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు..సారీ చెప్పిన రఘునందన్

-

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం మీద నిన్న దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారన్న సంగతి తెలిసిందే. రఘునందన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకే తెరతీశాయి. రఘునందన్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తోంది.

ఆయన ఏమన్నారంటే  ‘‘నేను సైన్స్ టీచర్ ని.. ప్రకృతిని నమ్ముతాం. వెనకటి ఒకాయన గిట్లే మాట్లాడి, గట్లే పోయిండు.. పావురాల గుట్టల. నువ్వు కూడా గంతే. యాక్షన్‌కు రియాక్షన్ కచ్చితంగా ఉంటుంది.’’ అని వైఎస్సార్ మరణంపై రఘునందన్ రావు మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైఎస్సార్ పరిస్థితే తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూడా వస్తుందని అనేలా రఘునందన్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీని మీద విమర్శలు రావడంతో ఆయన వెనక్కు తగ్గారు. తాను వైఎస్ ని ఏమీ అనలేదు అని తన మాటలను వక్రీకరించి అర్ధం చేసుకున్నారని చెప్పుకొచ్చారు. తనకు వైఎస్ కుటుంబం అంటే అభిమానం అని తను ఎందుకు ఇలా కామెంట్ చేస్తానని ఆయన పేర్కొన్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version