టీఆర్ఎస్ నేతలకు మ్యూజిక్ సౌండ్ మొదలయింది !

-

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు టీఆర్ఎస్ నేతల మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను టీఆర్ఎస్ లో నుండి బయటకు ఎందుకు పంపించారో ఇప్పటికీ సమాధానం లేదని, వస్తుంది అని కూడా అనుకోవడం లేదని అన్నారు. బీజేపీ లో చేరిన నన్ను ఈ పార్టీ ఆదరించింది.. పోటీ చేసే అవకాశాలు ఇచ్చిందని ఆయన అన్నారు. నా పై పెట్టిన కేసుల నుండి ధర్మ బద్ధంగా బయట పడతానని అన్నారు, మీడియా యాజమాన్యాలు ఇస్తున్న జీతాల పై ఆర్టీఐ చట్టం ప్రకారం దరఖాస్తు పెట్టి వివరాలు తీసుకుని అసెంబ్లీ లో ప్రస్తావిస్తానని అన్నారు.

దుబ్బాక స్పూర్తి ని గ్రేటర్ కార్యకర్తలు తీసుకొని పని చేస్తారని అనుకుంటున్నానని, గ్రేటర్ లో ప్రత్యేక వ్యూహం తో ముందుకు వెళ్తున్నామని అన్నారు. టీఆర్ఎస్ లో ఉండి అవమానాలకు గురవుతున్న వారిని బీజేపీ పార్టీ లోకి రావాలని విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన అన్నారు.  మా లో ఎలాంటి గ్రూప్ లు లేవు… అలా అనుకుంటున్న వారికి నిరాశే మిగులుతుందని ఆయన అన్నారు. వరద సహాయం కింద డబ్బులు పంచడం ఈ ప్రభుత్వం చేసిన తప్పన్న ఆయన ఓట్ల పథకంగా పంచుకోవాలనే కుట్ర ఉంది కాబట్టే ఇలా చేశారని అన్నారు. 2 లక్షల కన్నా ఎక్కువ డ్రా చేయొద్దని రూల్ ఉంటే జోనల్ కమిషనర్ 50 లక్షలు ఎలా బ్యాంకు నుంచి డ్రా చేశారు ? అని ప్రశ్నించారు. ఆల్రెడీ టీఆర్ఎస్  నేతల్లో నేనన్న మ్యూజిక్ సౌండ్ వినిపిస్తుంది అనుకుంటున్ననాని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version